VC Sajjanar: 'ఆర్ఆర్ఆర్'కు కొత్త అర్థం చెబుతున్న సజ్జనార్..
VC Sajjanar: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లోని 'ఎత్తరా జెండా' అనే పాట ఇటీవల విడుదలయ్యింది.;
VC Sajjanar: ప్రస్తుతం థియేటర్లలో 'రాధే శ్యామ్' సందడి నడుస్తోంది. చాలాకాలం తరువాత థియేటర్లలో విడుదలయిన పాన్ ఇండియా చిత్రం కాబట్టి రాధే శ్యామ్ పాజిటివ్ టాక్‌తో పాటు కలెక్షన్లను కూడా కొల్లగొడుతోంది. ఇక త్వరలోనే థియటర్లలో 'ఆర్ఆర్ఆర్' మ్యానియా మొదలుకానుంది. అయితే దీనిని ఉపయోగించి రోడ్డు రవాణా గురించి అవగాహన కల్పిస్తు్న్నారు సజ్జనార్.
మీమ్స్‌ను ఉపయోగించి రోడ్డు రవాణా గురించి చెప్పడంలో సజ్జనార్ తరువాతే ఎవరైనా అనిపించేలా చేస్తు్న్నారు. ఇప్పటికే పలు సినిమా పోస్టర్లు ఉపయోగించి సజ్జనార్.. టీఎస్‌ఆర్‌టీసీపై అవగాహన కల్పించారు. తాజాగా 'ఆర్ఆర్ఆర్'లోని పాటను కూడా దీనికోసం ఉపయోగించేశారు. ప్రస్తుతం సజ్జనార్ ట్వీట్ వైరల్‌గా మారింది.
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లోని 'ఎత్తరా జెండా' అనే పాట ఇటీవల విడుదలయ్యింది. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. అందుకే ఈ పాట వీడియోను ఉపయోగించి టీఎస్‌ఆర్‌టీసీ విశిష్టతను తెలియజేస్తున్నారు సజ్జనార్. అంతే కాకుండా 'ఆర్ఆర్ఆర్' అంటే రాష్ట్ర రోడ్డు రవాణా అంటూ కొత్త అర్థాన్ని చెప్తున్నారు. ఇటీవల సజ్జనార్ షేర్ చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
#TSRTC is at the Service of Public #RRR - రాష్ట్ర రోడ్డు రవాణా #TSRTCPublicService #EtharaJenda @TSRTCHQ @baraju_SuperHit @MilagroMovies @tarak9999 @ssrajamouli @AlwaysRamCharan @TarakFans @Chiru_FC @worldNTRfans @NTR2NTRFans @RRRMovie @AlwaysCharan_FC @TrackTwood @TV9Telugu pic.twitter.com/XybL6SDQWt
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 15, 2022