Hyderabad : రీల్స్ పిచ్చి లో యువత... రోడ్డు పై అసభ్య ప్రవర్తన...

Update: 2025-07-14 10:45 GMT

రీల్స్...రీల్స్..రీల్స్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండు.. డాన్సులు చేయడం, వంటలు చేయడం, తమ రోజు వారి కార్యక్రమాలను అందరికీ చూపించడం.. తినడం, పడుకోవడం ఇలా కాదేది ..రీల్స్ కు అనర్హం అన్నట్టు ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కామన్ ఐపోయింది. ఒక్క రీల్ చేసి ఫేమస్ అయిపోతే చాలు ఓవర్ నైట్ లో సెలబ్రిటీ కావచ్చు అని చాలామంది ఈ పిచ్చిలో మునిగిపోతున్నారు. ముఖ్యంగా యువత ఈ పిచ్చిలో పడి తామేం చేస్తున్నామో కూడా తెలియని మైకంలో ఉంటున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట రీల్స్ కోసం చేసిన బైక్ విన్యాసాలు ఇతరులకు చిరాకు పుట్టించాయి.

నడిరోడ్డుపై సిగ్గు లేకుండా ఓ ప్రేమ జంట అసభ్యంగా ప్రవర్తిస్తూ రీల్స్ తీసుకుని పనిలో పడ్డారు. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో ఈ ఘటన జరిగింది. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ఓ యువకుడు తన ప్రియురాలని ముందు ట్యాంక్ పై కూర్చోబెట్టుకొని రైడ్ చేస్తున్నాడు. అందరూ చూస్తుండగానే ఇద్దరు అసభ్యంగా ప్రవర్తిస్తూ రికార్డు చేసుకునే పనిలో పడ్డారు. పక్కన వాళ్ళు హెచ్చరించినా తమకేమీ పట్టనట్లుగా తమ పనిలో తాము మునిగిపోయారు. రోడ్డుపైనే మితి మీరి వ్యవహరించి అందరిని ఇబ్బందులకు గురి చేశారు.

ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పలువురు ఇదేం పోయే కాలం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐతే నలుగురిలో ఉన్నామనే కనీస సోయి లేకుండా యువత ఇలా ప్రవర్తించడం బాధాకరం.. ఇలాంటి వీడియోలు చూసి మరింత మంది కూడా నేర్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంపై కాసింత శ్రద్ధ ఉంచాలి. లేదంటే యువత పెడదారిన పట్టే దారులు ఎక్కువ. ట్రాఫిక్ పోలీసులు సైతం ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News