వరుస భూకంపాలతో టిబెట్ వణికిపోయింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. దాదాపు గంట సమయంలో మూడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి జనం పరుగులు పెట్టారు. మొదట భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున 2.41 గంటలకు బలమైన ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) పేర్కొంది.
భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సిస్మోలజీ తెలిపింది. రెండోసారి ఉదయం 3.06 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదైంది. గ్యాంగ్‌టక్‌కు 151 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చాయని పేరొంది. ఇక ఉదయం 3.48 గంటల ప్రాంతంలో మూడోసారి ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూమికి పది కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గుర్తించినట్లు చెప్పింది. అయితే, భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికార వర్గాలు తెలిపాయి. పరిపాలన, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.