పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని బలుచిస్తాన్లో రెండు చోట్ల ఐఈడీ బాంబు దాడులు జరిగాయి. ఈ జంట దాడుల్లో మొత్తం 14 మంది పాక్ సైనికులు చనిపోయా రు. మాచ్, బొలాన్ లోని షోర్కాండ్ ప్రాంతంలో పాక్ సైనిక కాన్వాయ్పై రిమోట్ ఆధారిత ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్ సహా మొత్తం 12 మంది మృతిచెందారు. పేలుడు దాటికి మిలిటరీ వాహనం పూర్తిగా ధ్వంస మైంది. మరో ఘటనలో కెచ్లోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాక్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లక్ష్యంగా ఐఈడీ పేలి మరో ఇద్దరు సైనికులు చనిపోయారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ బీఎల్ ఏ ప్రకటించింది. బలుచిస్తాన్ వేర్పా టువాద గ్రూపులు పాక్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ చాలా కాలంగా సాయుధ బలగాల తో పోరాడుతున్నాయి. ఒకవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిక్షణా శిభిరా లపై భారత బలగాలు దాడులు చేసిన కొన్ని గం టల్లోనే బలూచ్ తీవ్రవాదులు దాడులకు పాల్ప డటం దాయాది దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది.