Bolivia Military : బొలీవియాలో సైనిక తిరుగుబాటు! ఆర్మీ జనరల్ అరెస్ట్

Update: 2024-06-28 06:28 GMT

బొలీవియాలో సైనిక తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించింది. అధ్యక్షుడి భవనంలోకి ఆర్మీ వాహనాలు దూసుకెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను అరెస్టు చేశారు. మధ్యాహ్నం అధ్యక్ష భవనం, కాంగ్రెసు నిలయమైన సెంట్రల్ ప్లాజా స్క్వేర్ లోని సైనిక దళాలు చొచ్చుకెళ్లాయి. అధ్యక్ష భవనం తలుపును ఆత్మీ వాహనం ఢీకొట్టింది. అనంతరం సైనికులు లోపలకు దూసుకెళ్లారు.

బొలీవియా అధ్యక్షుడు ఆర్స్, సైనిక తిరుగుబాటుపై ఆందోళన వ్యక్తం చేశారు. 'ఈ రోజు దేశం తిరుగుబాటు ప్రయత్నాన్ని ఎదుర్కొంటోంది. గురువారం మరోసారి బొలీవియాలో ప్రజాస్వామ్యం చిన్నబోయింది" అని అధ్యక్ష కార్యాలయం నుంచి సందేశం పంపారు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా బొలీవియన్ ప్రజలు సంఘటితమై ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మరోవైపు మిలిటరీ కమాండర్ జోన్ విల్సన్ శాంచెజ్ తో అధ్యక్షుడు ఆర్స్ ప్రమాణం చేయించారు.

శాంతిభద్రతలను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. దీంతో సైనికులు తమ యూనిట్లకు తిరిగి వెళ్లాలని కొత్త ఆర్మీ కమాండర్ శాంచెజ్ ఆదేశించారు. సైనికులు రక్తం చిందించవద్దని ఆయన కోరారు.

Tags:    

Similar News