Piyush Goyal : భారత్ -అమెరికా మధ్య చర్చలు .. కేంద్రం కీలక ప్రకటన

Update: 2025-09-27 06:46 GMT

ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని వివిధ అంశాలపై భారత్ -అమెరికా మధ్య చర్చలు జరిగాయని కేంద్రం తెలిపింది. వీలైనంత త్వరగా పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని పేర్కొంది. ట్రేడ్ డీల్ పై చర్చలు జరిపేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని అధికారుల బృందం భారత్ కు తిరుగు పయనమైంది. అమెరికా పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ ఆ దేశ వాణిజ్య ప్రతినిధితో ఒప్పందంపై చర్చలు జరిపారు. వివిధ అంశాలపై అమెరికా ప్రభుత్వ అధికారులతో పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం నిర్మాణాత్మక చర్చలు జరిపిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. భారత్ లో పెట్టుబడులకు సంబంధించి అమెరికా వ్యాపారవేత్తలతో కూడా చర్చలు జరిపారని వెల్లడించింది. భారత్ లో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అమెరికా పెట్టుబడిదారులు సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొంది.

Tags:    

Similar News