U.S : అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడు మృతి

Update: 2024-11-30 10:45 GMT

అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం నగరానికి చెందిన సాయితేజ మృతిచెందారు. దీంతో మృతుడి నివాసం వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. నగరంలోని రాపర్తి నగర్ కు చెందిన నూకారపు కోటేశ్వరరావు దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. ఉన్నత చదువుల కోసం తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించాడు. కుమారుడు సాయితేజా MS చదువుతున్నాడు. చిగాగో సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో సాయితేజా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. బంధువులు, కుటుంబ సభ్యులు ఆర్తనాదాలతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News