సుంకాలపై చర్చించేందుకు తెలిసిందే. టారిఫ్స్ గురించి చర్చించేందు అమెరికా చైనాను సంప్రదించింది. ఈ విషయాన్ని చైనీస్ అధికార పత్రిక యుయువాన్ టాంటియన్ వెల్లడించింది. టారిఫ్స్ గురించి ఇప్పటి వరకు యూఎస్ తో ఎలాంటి చర్చలు జరుపలేదని చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ నిన్న ప్రకటించారు. ప్రతీకార సుంకాలపై కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు తనకు ఫోన్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను చైనా ఖండించింది. తాజాగా అమెరికా సంప్రదింపులు చేస్తున్న ట్లు చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. నిజానికి గత కొన్నేళ్లుగా వాణిజ్య ఒప్పందా లకు సంబంధించిన వార్తలను చైనా కమ్యూ నిస్టు పత్రిక ది గ్లోబల్ టైమ్స్, పీపుల్స్ డైలీ నివేదిస్తుంటాయి.