పెరూ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాం తంలో శుక్రవారం భూమి భారీ కుదుపులకు లోనైంది. రిక్టర్ స్కేల్ పై ఆ భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భారీ భూకపం తర్వాత వెంటవెంటనే పలు చిన్నచిన్న ప్రకంపనలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపంవల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్ జెన్ తెలిపారు.