ఇజ్రాయెల్ ప్రధాననమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు యుద్ధ నేరాల కేసులో అరెస్టు వారెంట్ ఇవ్వాలని అంతర్జాతీయ నేర న్యాయ స్థానంలో ప్రధాన ప్రాసిక్యూటర్ అభ్యర్ధన సంచలనం రేపుతోంది. దీనిపై ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. ఎవరో చేసిన అబద్ధాల ఆరోపణల ఆధారంగానే తనపై ఆ వారెంట్ కోరుతున్నారని అన్నారు.
ప్రధాన ప్రాసిక్యూటర్ కరీంఖాన్ ను తీవ్రంగా విమర్శించారు నెతన్యాహు. గాజాలో ఆకలి కేకల్ని ఇజ్రాయెల్ యుద్ధతంత్రంగా వాడుతుందోన్న విమర్శలను ఖండించారు. ఆకలి మంటల్ని ఇజ్రాయెల్ యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని గతంలో యూఎన్ఓ ఆందోళన వ్యక్తంచేసింది.
ఆకలికేకలను యుద్ధతంత్రంగా వాడుతున్నట్టు నిజమైతే.. యుద్ధ నేరం కింద పరిగణించాల్సి వస్తుందని యూఎన్ఓ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ ఆరోపణల్ని నమ్మేందుకు ఆధారాలున్నాయని ఐసీసీ లాయర్లు అంటున్నారు. ఐతే.. ఈ వారెంట్ అభ్యర్థనను అమెరికా కూడా తప్పుపట్టింది.