U.S. : ట్రంప్ పై జనాగ్రహం.. అమెరికా అంతటా ఆందోళనలు

Update: 2025-04-07 13:45 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై జనం ఫైరవుతున్నారు. దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. న్యూయార్క్‌ నుంచి అలస్కా దాకా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హ్యాండ్సప్ అంటూ నినదించారు. ఏకపక్ష నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కులపై.. ట్రంప్, ఎలాన్‌ మస్క్‌లు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మన్‌హటన్‌ నుంచి అలస్కా దాకా..వేలాది మంది ఆందోళనల్లో పాల్గొన్నారు.మరిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతి పెద్ద నిరసనగా ఇది నిలిచింది. గతంలోనూ నిరసనలు జరిగినా ఈ స్థాయిలో జరగలేదు. పౌర హక్కుల సంఘాలు, కార్మిక యూనియన్లు, స్వలింగ సంపర్క సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్‌ సిటిజెన్, ఎన్నికల సంస్కరణలు.. తదితర 150 సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1,200 ప్రాంతాల్లో ఈ ఆందోళలు జరిగాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Tags:    

Similar News