Tata EV : ఈవీల రేట్ భారీగా తగ్గించిన టాటా

Update: 2024-09-11 10:06 GMT

టాటా మోటార్స్ తన విద్యుత్ కార్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఆఫ్ కార్స్ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. రెండు రోజుల క్రితం కంపెనీ తన పెట్రోల్, డీజిల్ కార్లపై అత్యధికంగా 2.05 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. టాటా నెక్సస్ ఈవీపై 3 లక్షల రూపాయలు డిస్కౌంట్ ను తాజాగా కంపెనీ ప్రకటించింది.

పంచ్ ఈవీపై 1.20 లక్షలు, టియాగో ఈవీపై 40,000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో పాటు అదనంగా కంపెనీ ఆరు నెలల పాటు ఉచిత ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ప్రకటించింది. కంపెనీకి ఉన్న 5,500 టాటా పవర్ ఛార్జింగ్ పాయింట్స్ వద్ద ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

పంచ్ ఈవీ ధర 9.99 లక్షల నుంచి, నెక్సన్ ఈవీ ధర 12.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది. ధరల భారీ తగ్గింపు మూలంగా ఈ ఫెస్టివల్ సీజన్లో అమ్మకాలు పెరుగుతాయని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భావిస్తోంది. 9వ తేదీ నుంచి టాటా మోటార్స్ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది.

Tags:    

Similar News