పడవ సముద్రంలో మునిగి 90మందికి పైగా మృత్యువాత పడిన దుర్ఘటన సౌతాఫ్రిగా లోని (South Africa) మొజాంబిక్ లో జరిగింది. మొజాంబిక్ ఉత్తర తీరంలో రద్దీగా ఉండే తాత్కాలిక ఫెర్రీ మునిగిపోయింది. 90 మందికి పైగా మరణించారని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు.
దక్షిణాఫ్రికాలో అక్టోబర్ నుండి దాదాపు 15వేల మంది నీటి వ్యాధులకు ప్రభావితం అయ్యారు. 32 మరణాలు కూడా నమోదయ్యాయి. ఇక్కడి తీర ప్రాంతం నంపులా కూడా బాగా ప్రభావితం అయింది. ఇక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లే తొందరలో పరిమితికి మించి బోట్లలో జనం ప్రయాణాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద సమయంలో దాదాపు 130 మందితో కూడిన ఫిషింగ్ బోట్ నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో ఈ ఘోర విషాద ఘటన జరిగిందని తెలుస్తోంది. బోటు ఓవర్ వెయిట్, ఓవర్ రష్ కావడంతో మునిగిపోయింది. బాధితుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు.
బోటు సహాయక సిబ్బంది ఓ ఐదుగురి ప్రాణాలు కాపాడారు. మరింత మంది కోసం వెతుకుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవు. కలరా గురించి ఆందోళన చెందుతూ.. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రాణభయంతో వేలాదిగా తరలివెళ్తుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.