సొంత ప్రయోజనాలకు పనికి వస్తుంది అంటే ఏదైనా చేయగల వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కుటుంబ వ్యాపార ప్రయోజనాలను ముడిపెట్టి పరిపాలన సాగించగల సమర్థుడూ ఆయనే. ఇక దేశ ప్రజలను ఎండబెట్టి ఉగ్రవాదులను పెంచి పోషించడం, వారిని భారత్‌పైకి ఉసిగొల్పడం తప్ప మరో పని లేని ధూర్త దేశం పాకిస్థాన్. అలాంటి ట్రంప్, పాక్ పాలకుల మధ్య స్నేహం మరింత బలపడింది. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌పై ట్రంప్ ఎక్కడలేని ప్రేమ కురిపిస్తుండగా.....ఆయనతో పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి కారణం అని భావిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మన శత్రుదేశాన్ని ట్రంప్ ఎందుకు ఇంతలా దగ్గరకు తీసుకుంటున్నారు. ఓ వైపు భారత్‌పై సుంకాల బాదుడు బాదుతూ పాక్‌పై ఏమిటీ ప్రేమ. మనం ఎంత మేరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది