ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందిన సిస్టర్ ఇనా కనబారో లుకాస్ తుదిశ్వాస విడిచారు. ఆమె యసు 116 ఏండ్లు. మరికొన్ని వారాల్లో 117 అందుకోనున్న దశలో ఆమె కన్నుమూశారు. దక్షిణ బ్రెజిల్లో లోని రియో గ్రాండ్ దుసుల్ రాష్ట్రంలో 1908 మే 27న జన్మించిన ఆమె.. తన 20వ ఏట క్యాథలిక్ సన్యాసినిగా మారారు. వందేళ్లు దాటిన తర్వాత కూడా ఆమె ఫుట్బాల్ క్రీడ పట్ల ఆసక్తి చూపేవారు. 106వ ఏట కంటి శుక్లాల ఆపరేషన్ మినహా ఆమెకు మరెలాంటి శస్త్రచికిత్సలు జరుగలేదు. వృద్ధాప్య సమస్యలతో కాసెరోస్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 110వ జన్మదినాన పోప్ ఫ్రాన్సిస్ సిస్టర్ ఇనాను సత్కరించారు.