AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
శ్రీలక్ష్మి, రజత్‌ భార్గవ, ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ... మొత్తం 19 మంది ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి తన మార్క్‌ పాలన చేస్తున్న చంద్రబాబు... మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే జలవనరులు, వ్యవసాయం, పంచాయతీరాజ్ ఇలా కీలక శాఖల ప్రధాన కార్యదర్శులను బదిలీ చేసింది. వైఎస్ జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్‌లను.. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ మురళీధర్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - జి. సాయి ప్రసాద్

కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - గోపాలకృష్ణ ద్వివేదీ

సీఎం కార్యదర్శి - ప్రద్యుమ్మ

పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి - శశిభూషణ్ కుమార్

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - అనిల్ కుమార్ సింఘాల్

పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి - కోన శశిధర్

ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శి - కోన శశిధర్( అదనపు బాధ్యతలు)

సీఆర్‌డీఏ కమిషనర్ - కాటమనేని భాస్కర్

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ - సిద్ధార్థ్ జైన్‌

వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - రాజశేఖర్‌

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి - సౌరభ్‌గౌర్‌

నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి - సౌరభ్‌గౌర్‌ (అదనపు బాధ్యతలు)

ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శి - బాబు

ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ( వ్యయం) కార్యదర్శి - జానకి

పశు సంవర్ధకశాఖ కార్యదర్శి - ఎం.ఎం. నాయక్

గనులశాఖ కమిషనర్ - ప్రవీణ్ కుమార్

ఫైనాన్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి - వినయ్ చంద్

Tags

Next Story