ABP Survey : ఏబీపీ సర్వే రిలీజ్.. దుమ్ములేపిన బాబు-పవన్ కూటమి

ఏబీపీ- సీఓటర్ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు రిలీజయ్యాయి. టీడీపీ-బీజేపీ జనసేన కూటమి భారీ స్థానాల్లో గెలవబోతోందనని ఆ సర్వే తెలిపింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. అందులో ఇరవై స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించనుంది. మరో ఐదు స్థానాల్లో మాత్రమే.. అధికార వైసీపీ విజయం సాధించబోతున్నట్లుగా తేలింది. ఎన్డీఏ కూటమికి 45 శాతం ఓట్లు వస్తాయని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
కాంగ్రెస్ కు మూడు శాతం రాగా.. ఇతరులకు పది శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ సర్వేలో తేలింది. సీట్ల పరంగా చూస్తే.. బీజేపీ మూడు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా పదిహేడు స్థానాల్లో విజయం సాధించనున్నాయి. మొత్తంగా ఈ కూటమికి ఇరవై స్థానాలు వస్తాయని సీఓటర్ సర్వేలో తేలింది.
తెలంగాణలోనూ లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేదానిపై ఏబీపీ సీఓటర్ సర్వే రిలీజైంది. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఊపు కొనసాగించే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలుచుకుంటుందని ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ తెలిపాయి. బీజేపీకి నాలుగు లోక్ సభ స్థానాలు, బీఆర్ఎస్ కు ఒక్కటి, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. న్యూస్ 18 నిర్వహించిన మెగా ఒపీనియన్ పోల్‌లోనూ ఏపీలో ఎన్డీఏ కూటమికి యాభై శాతం ఓట్లు 18 లోక్‌సభ సీట్లు వస్తాయని తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com