AP : మళ్లీ వైసీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి!

ఇటీవల షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) తిరిగి వైసీపీలో (YSRCP) చేరునున్నారని తెలుస్తోంది. సన్నిహితుల సూచన మేరకు సొంతగూటికి వెళ్లే్ందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ కూడా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
రెండు రోజుల కిందట ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఎంపీ విజయసాయి రెడ్డి మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. విజయసాయి రెడ్డితో చర్చల తర్వాత జగన్‌ను కలవాలని ఆర్కే అనుకుంటున్నట్లగా సమాచారం. ఇవాళ నేడు సీఎం జగన్‌తో ఆర్కే భేటీకానున్నట్లుగా తెలుస్తోంది.
మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి ఆర్కే రాజీనామా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో నీతి నిజాయితీతో, ధర్మంగా ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కట్టుబడి పనిచేశానని చెప్పారు. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com