AP: మా మామ ఓ నీచుడు... ఓటేస్తే అది వృథానే

AP: మా మామ ఓ నీచుడు... ఓటేస్తే అది వృథానే
అంబటి రాంబాబు అల్లుడి సంచలన వ్యాఖ్యలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు ఓటు వేయవద్దని ఆయన అల్లుడు గౌతమ్ వీడియో విడుదల చేశారు. అంబటి రెండో అల్లుడు గౌతమ్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. అంబటికి ఓటు వేస్తే ఎమ్మెల్యే వంటి పవిత్రమైన పదవి అపవిత్రమవుతుందని.. ఆయన ఆ పదవికి ఏ మాత్రం అర్హులు కాదని గౌతమ్ తన వీడియోలో విమర్శించారు. మంచి, మానవత్వం, మర్యాద ఏ మాత్రం లేని అంబటికి ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుందని చెప్పారు.

‘‘అంబటి రాంబాబుకి అల్లుడిని కావడం నా దురదృష్టం. అతనికి వ్యక్తిత్వం లేదు. శవాలమీద పేలాలు ఏరుకునే రకం. రోజూ దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు.. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఎదురు కాకూడదని కోరుకుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెబుతున్నానంటే.. అతను పోటీ చేయబోతున్న పదవి అలాంటిది. ఎమ్మెల్యే అంటే.. మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలి. వంద శాతం లేకపోయినా కనీసం వాటిలో 0.001 శాతం కూడా లేని వ్యక్తి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు తెలియకుండానే చెడును ప్రోత్సహిస్తున్నట్టు. ఎవరైతే నిస్సిగ్గుగా.. పెద్ద గొంతేసుకుని అరిచి అబద్ధాన్ని నిజం చేయొచ్చనే భ్రమలో బతుకుతారో అలాంటి వాళ్లకు ఓటేస్తున్నట్టు లెక్క. ఎంత నీచమైన పనులు చేసినా సమాజంలో హుందాగా బతకవచ్చని అనుకునే వాళ్లను ప్రోత్సహించినట్టే అవుతుంది. అంబటి లాంటి వారిని ఎన్నుకుంటే రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. ప్రజలు గమనించి సరైన బాధ్యతతో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి’’ అని గౌతమ్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story