AP: సాగు నీటి కోసం రోడ్డెక్కిన అనంత రైతులు

AP: సాగు నీటి కోసం రోడ్డెక్కిన అనంత రైతులు
పంట ఎండిపోతున్నా జగన్‌ స్పందించడం లేదని ఆగ్రహం.... రోడ్డుపై బైఠాయించిన అన్నదాతలు...

గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు నీళ్లు విడుదల చేయలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ మూస్తూరు వద్ద రోడ్డుపై బైఠాయించారు.ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి పెట్టిన రైతులు... ఒకట్రెండు తడుల ఇస్తే చివరిదశలో ఉన్న పంటలను కాపాడుకుంటామని వేడుకున్నారు. స్థానికంగా పంటలు ఎండుతుంటే నీళ్లివ్వకుండా మంత్రి పెద్దిరెడ్డి గొప్పల కోసం హంద్రీనీవా ద్వారా పుంగనూరుకు తరలించడం దారుణమని.... ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలేశామని, నీళ్లిచ్చి ఆదుకోకుంటే తమకు చావే గతి అంటూతీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లను పోలీసులు అరెస్టు చేశారు.


2016లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్‌ దగ్గరుండి నీళ్లిచ్చే ఏర్పాటు చేశారని రైతులు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలేశామని, నీళ్లిచ్చి ఆదుకోకుంటే చావే గతి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి ఉరవకొండలో ఓట్లు తొలగించడంపై ఉన్న శ్రద్ధ... రైతులకు నీళ్లివ్వడంపై లేదని పయ్యావుల మండిపడ్డారు. పుస్తెలమ్మి, పిల్లల చదువుల్ని పణంగా పెట్టి లక్షల రూపాయలు ఖర్చు చేసిన రైతులను... ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


దాదాపు 2 గంటలకు పైగా సాగిన రైతుల ధర్నాతో ముష్టూరు వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. పయ్యావుల కేశవ్‌ ఉంటే రైతులను కదిలించడం కష్టమని భావించిన పోలీసులు... ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. తొలుత స్టేషన్‌కు తీసుకెళ్లాలనుకున్నా ఆ తర్వాత కేశవ్‌ను ఇంట్లో వదిలిపెట్టారు. సాగునీటి కోసం అనంతపురం రైతులు రోడ్డెక్కారు. కనీసం ఒక్క తడి ఇవ్వమంటూ కదం తొక్కారు. లేదంటే 300 కోట్ల విలువైన పంటలు కోల్పోతామని ఆందోళన వెలిబుచ్చారు. ఆ పరిస్థితి వస్తే మూకుమ్మడిగా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోవడం తప్ప... మరో మార్గం లేదంటూ వాపోయారు. రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం... వారికి మద్దతుగా గళమెత్తిన పయ్యావుల కేశవ్‌ను అరెస్టు చేసి చేతులు దులుపుకొంది.

ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి పెట్టామని... ఒకట్రెండు తడుల నీళ్లిస్తే చివరిదశలో ఉన్న పంటలను కాపాడుకుంటామని వేడుకున్నారు. స్థానికంగా పంటలు ఎండుతుంటే నీళ్లివ్వకుండా... మంత్రి పెద్దిరెడ్డి గొప్పల కోసం హంద్రీనీవా ద్వారా పుంగనూరుకు తరలించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story