POLLS: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

POLLS: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎన్నికల సంఘం... 26న నామినేషన్ల పరిశీలన..

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరిస్తామని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. రేపటి నుంచి 25 వరకు.... ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని చెప్పారు. 26న నామినేషన్ల పరిశీలన.., 29 న నామినేషన్ల ఉపసంహరణకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో సున్నితమైన పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా పెట్టి అదనపు భద్రత కల్పిస్తామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో మెుత్తం 19వందల 15పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని... ఎన్నికల ప్రక్రియలో 13వేల 8వందల మంది సిబ్బంది పాల్గొంటారని... కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్లు... కడప కలెక్టరేట్‌లో స్వీకరిస్తామని... జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు వెల్లడించారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు... ఆయా నియోజకవర్గాల్లోని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో స్వీకరిస్తారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.


మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో భాగంగా రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్‌లో... అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. 26న అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన... 29 వరకు అభ్యర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ ఉంటుందని ఆయన వెల్లడించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా 232 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రేపటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో... ఎన్నికల నియమావళి ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ .. రేపు విడుదల కానుంది. ఈ దశలో తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 25 ఎంపీ సీట్లు 175 అసెంబ్లీ సీట్లు.. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు..... ఒక అసెంబ్లీ స్థానానికి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉత్తరప్రదేశ్ లోని 13 ఎంపీ సీట్లు........ మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో 8, బీహార్ లో 5, జార్ఖండ్... ఒడిశాలో నాలుగు జమ్ముకశ్మీర్ లోని ఒక లోక్ సభ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్ తోపాటు......... ఒడిశా శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన....... ఉంటుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలను వెల్లడిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story