AP: ఎస్మా ప్రయోగంతో ఉవ్వెత్తున ఎగిసిన నిరసన

AP: ఎస్మా ప్రయోగంతో ఉవ్వెత్తున ఎగిసిన నిరసన
27వ రోజూ కొనసాగిన ఆందోళనలు... జీవో ప్రతులను దహనం అంగన్‌వాడీలు

ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీల ఆందోళన 27వ రోజూ ఉద్ధతంగా కొనసాగింది. న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఎస్మా ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీలు రాష్ర్టవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. ఎస్మా జీవో పత్రాలను దహనం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోకాళ్లపై నిలబడి తక్షణమే ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో అంగన్వాడీలు బోనాలు ఎత్తుకుని నిరసన ప్రదర్శన చేశారు. కర్నూలు జిల్లాలో అంగన్వాడీల సమ్మెకు సీపీఎం పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. అనంతపురంలో అంగన్వాడీల ఆందోళనకు జనసేన వీర మహిళా విభాగం మద్దతు తెలిపింది.


బాపట్లలో రిలే నిరాహార దీక్షల ప్రారంభించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంగన్వాడి కార్యకర్తలు సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడానికి ఖండించారు. జీవో పత్రంలో దహనం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం ముందే 27 రోజులుగా సమ్మచేస్తున్నట్లు గుర్తుగా 27 నెంబర్ ఆకారంలో మహిళలు కూర్చొని ఆందోళన చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కరించకపోగా తిరిగి సమ్మెను నిషేధిస్తూ ఏస్మ చట్టాన్ని ప్రయోగిస్తూ జీవో తేవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఆంధ్రాలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 27వ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో కొనసాగింది. 24 గంటల రిలే నిరాహార దీక్షలు మూడో రోజు చేపట్టారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, అమ్ ఆద్మీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న అంగన్వాడి వర్కర్లు నేడు స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబును కలిసి వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నామని వారు తమ యొక్క బాధను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు తదనంతరం వారి యొక్క సమస్యలను లిఖితపూర్వకంగా రాసి వినతి పత్రం అందజేశారు

విజయనగరం జిల్లా చీపురుపల్లి చీపురుపల్లి లో అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్ని చట్టాల ప్రయోగించిన వేతనాలు పెంచే వరకు సమ్మె విడనాడమని అంగన్వాడీలు ప్రకటించారు. సమష్యల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 27వ రోజుకు చేరింది. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మద్దతు ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story