AP: కనుమ పండుగ వేళ వినూత్న నిరసనలు

AP: కనుమ పండుగ వేళ వినూత్న నిరసనలు
కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళనలు.... జగన్‌ వల్ల రోడ్డున పడ్డామంటూ ఆవేదన

ఊరూవాడ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే.. జగన్‌ ప్రభుత్వ నిరంకుశ వైఖరితో తామంతా రోడ్డున పడాల్సిన దుస్థితి తలెత్తిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలతో కదం తొక్కారు. తమను సంక్రాంతి పండుగ జరుపుకోకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందంటూ మండిపడ్డారు. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు 36వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. కనుమ పండుగ వేళ వినూత్న నిరసనలతో హోరెత్తించారు.


నంద్యాలలో డిమాండ్లను గాలిపటాలపై రాసి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఎస్మా నోటీసులతో బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని కర్నూలులో ఆందోళన చేశారు. ప్రభుత్వం దిగే వచ్చే వరకు సమ్మె ఆపేది లేదంటూ అనంతపురం జిల్లా సింగనమల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. కల్యాణదుర్గం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జగన్‌, సజ్జల, బొత్స ఫొటోలు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీల దీక్ష శిబిరానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తమను బెదిరించడానికి వైకాపా నేతలు, ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని అంగన్వాడీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం మట్టి తింటూ నిరసన తెలిపారు.


కనీస వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట కోటి సంతకాల సేకరణ చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద పిండి వంటలు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగి రాకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సమ్మెకు ప్రజల మద్దతు కూడగడుతూ సంతకాల సేకరణ చేపట్టారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడవరంలో సీఎం జగన్‌, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రాల పటాల ముందు పిండివంటలు ఉంచి... అంగన్వాడీలు కారం అన్నం తింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కళ్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయం వద్ద జగన్ , సజ్జల, బొత్స ఫొటోలు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద..... అంగన్వాడీల దీక్ష శిబిరానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా... తమను బెదిరించడానికి వైసీపీ నేతలు, ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని.... అంగన్వాడీలు మండిపడ్డారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని.... నెల్లూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story