AP Assembly : జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly : జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచే అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazeer ) బక్రీద్ సెలవులో ఉండటంతో మార్పు చేశారు. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత నూతన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది.కాగా, ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఇందులో అత్యధికంగా టీడీపీకి 135 స్థానాలు, జనసేనకు 21, బీజేపీకి 9 సీట్లు దక్కాయి. ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాల్లోనే గెలుపొందింది.

Tags

Next Story