AP : లాగరు.. వదలరు.. గందరగోళంలో ఏపీ బీజేపీ

AP : లాగరు.. వదలరు.. గందరగోళంలో ఏపీ బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh ) బీజేపీ (BJP) జిడ్డు రాజకీయం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన (TDP-Janasena) పొత్తు కూడా కుదుర్చుకున్నాయి. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే పొత్తు అంశంలో ప్రస్తుతం ఏపీ బీజేపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉంటుందో ఉండదో తెలియడం లేదు.

టీటీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటే సీట్లు సంపాదించుకుందామనేది కొంతమంది బీజేపీ ఆశావహులు భావిస్తున్నారు. ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా.. టీడీపీ-జనసేన కూటమితో పొత్తులతోనే ముందుకు వెళ్లాలా.. అనే దానిపై హైకమాండ్ సాగతీత ధోరణి ఫాలో అవుతోంది. అందుకే ఏపీ బీజేపీ అభ్యర్థుల ప్రకటన లేట్ అవుతోందన్న చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అటు పార్లమెంట్.. ఇటు అసెంబ్లీలో ఏపీ నుంచి మెజారిటీ స్థానాల్లో తమ లక్ టెస్ట్ చేసుకోవాలని ఓవైపు కమలం లీడర్లు ఆశపడుతున్నారు. లేకపోతే ఒంటరిగానైనా పోటీకి సై అంటున్నారు.

ప్రధాన పార్టీలన్నీ బరిలోకి దిగినప్పుడు.. బీజేపీ మాత్రం సైలెంట్ గా కూర్చోవడం చాలామందికి నచ్చడం లేదు. ఇంత వరకూ కనీస ప్రచార ప్రణాళిక లేదు. ఒక్క బహిరంగసభ నిర్వహించలేదు. చిన్న చిన్న కార్యక్రమాలు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. దీనికి కారణం పొత్తులు ఖచ్చితంగా ఉంటాయన్న ఓ నమ్మకమే. కారణాలేమిటో కానీ.. అసలు అడుగు ముందుకు పడటం లేదు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇంత లేట్ గా అభ్యర్థులు ఖరారు చేసుకుంటే పొత్తులో సీట్లు వచ్చినా... రెబల్స్ బెడద ఉంటుంది కాబట్టి కనీసం డిపాజిట్ అయినా వస్తుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్నారు ఏపీ బీజేపీ ఆశావహులు.

Tags

Read MoreRead Less
Next Story