CBN: చంద్రబాబు పర్యటన రద్దు

CBN: చంద్రబాబు పర్యటన రద్దు
X
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో ఈ రోజు విజయనగరంలో సీఎం చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. విజయంనగరం పర్యటనకు బదులుగా.. నేడు సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి, విశాఖ పట్టణం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. చింతల గోరువాని పాలెంలో లారెస్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఇక్కడ కార్యక్రమం పూర్తవ్వగానే.. అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అద్వాన్నంగా మారిన రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు.

చంద్రబాబు పాలనలో ఏపీకి పూర్వ వైభవం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి దిగ్గజ సంస్థలు ఏపీకి క్యూ కడుతున్నాయి. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం వదిలి వెళ్లిన లూలు గ్రూప్ సంస్థ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఏపీలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు.


చంద్రబాబుకే సాధ్యం: మంత్రి

సంపద సృష్టించడం సజావుగా పథకాలు అమలు చేయడం ఒక చంద్రబాబుకే సాధ్యంమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. జెండా ఊపి గ్యాస్ పంపిణీ చేసే వాహనాలను మంత్రి ప్రారంభించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్యాస్ సిలిండర్ మంత్రి అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పవన్ ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే

ప్రభుత్వ వైద్య కళాశాల పేరు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిపాదించారు. ఈ మేరకు సీఎంకు.. డిప్యూటీ సీఎం అన్ని వివరాలు అందించారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు.. దాన్ని పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తన ప్రతిపాదనకు వెంటనే స్పందించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.


Tags

Next Story