CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

శాఖలపై గతంలో గంటల పాటు సమీక్షలు నిర్వహించే ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) రూట్ మార్చారు. ఏ శాఖతో రివ్యూ అయినా 30 నిమిషాల్లోనే ముగించాలని ఉన్నతాధికారులకు సూచించారట. ఇసుక, రహదారులు, నిత్యావసరాలపై నిన్న సమీక్షించిన CM.. ఒక్కో శాఖకు 30 నిమిషాలే కేటాయించారు. అధికారులు ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే ముగించమని ఆదేశించారట. కందిపప్పుల ధరలు పెరగడాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రంతో మాట్లాడుతామని బదులిచ్చారు.
నూతన ఇసుక పాలసీపై అధికారులతో సీఎం చంద్రబాబు కూలంకషంగా చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. కాగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందిస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com