AP NEWS: జగన్ మాటలకు అర్ధాలే వేరులే..
ఏపీ సీఎం మాటలకు ఆర్ధాలే వేరులే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఓ మాట..అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చిన కియా ఫ్యాక్టరీని తరిమేస్తానని అన్నారు. పశ్చిమబెంగాల్లో నానో కార్ల ఫ్యాక్టరీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.ఆ తర్వాత ఆయన సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు ఆ మాటలన్ని మర్చిపోయారు. లేటెస్ట్‌గా కియా కార్ల ఫ్యాక్టరీ తన పదో లక్ష కారును ఉత్పత్తి చేసింది. ఈ సందర్భంగా కియా కంపెనీకి విషెష్ చెపుతూ జగన్ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతగా రైతులను రెచ్చగొట్టి భూములు ఇవ్వొద్దని చెప్పిన జగనే ఇవాళ కియాకు శుభాకాంక్షలు చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ప్రతిపక్ష నేత హోదాలో మీ అందరికీ హామీ ఇస్తున్నా..ఇంకో సంవత్సరం ఓపిక పడితే ఎలక్షన్లు వస్తాయి...ఆ తర్వాత మనందరి ప్రభుత్వం వస్తుందని గట్టిగా చెబుతున్నా...ఎలాగైనా మన భూములు రక్షించుకుందాం..దానికోసం వైసీపీ మీకు తోడుగా ఉంటుంది. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తుంది.కోర్టుల దాకా కూడా మీకు సహాయంగా నిలబడుతుంది. ఈ సంవత్సరం అందరం కలసికట్టుగా భూము లను కాపాడుకుందాం. ఈలోపు మీకు ఇష్టం ఉండి, ఇష్టం లేక పోయినా కూడా బలవంతంగా భూములు తీసుకునే కార్యక్రమం ఎవరు చేసినా.. ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా ఇక్కడికొచ్చి దగ్గరుండి వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నానో కార్ల ఫ్యాక్టరీకి చేసి చూపించింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను చెబుతున్నా అంటూ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు
అయితే కియా పరిశ్రమ విలువను గుర్తించారో లేక ప్రపంచ వ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తున్నారు కదా తాను కూడా విషెష్ చెప్పకుంటే వెనుకపడిపోతామనుకున్నారో కానీ కియాకు విషెష్ చెప్పారు సీఎం జగన్.నాలుగేళ్ల అతి తక్కువ కాలంలో పదో లక్ష కారును ఉత్పత్తి చేసిన కియాకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆటోమొబైల్ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ సానుకూలమైనదని ఈ విజయం స్పష్టం చేస్తుంది. కియా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com