SHARMILA: ఉద్యోగాలు, ప్రత్యేక హోదా ఏది జగనన్నా..?

SHARMILA: ఉద్యోగాలు, ప్రత్యేక హోదా ఏది జగనన్నా..?
వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ షర్మిల... జగనన్నా అంటూనే తీవ్ర విమర్శలు

ముఖ్యమంత్రి జగన్‌ సహా వైసీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలందరూ బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని A.P.P.C.C. అధ్యక్షురాలు Y.S.షర్మిల విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న సీఎం జగన్ మాటలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. Y.S. రాజశేఖర్‌రెడ్డి ప్రజాప్రస్థానం యాత్ర ముగించిన ఇచ్ఛాపురం నుంచి.... ఆమె ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ప్రారంభించారు. తొలిరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన ఆమె కార్యకర్తలతో అంతర్గత సమావేశాల్లో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలను కలుసుకోవడంతోపాటు... నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు ఏపీ పర్యటన చేపట్టిన PCC అధ్యక్షురాలు Y.S.షర్మిల.... ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ వ్యాఖ్యలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఏపీలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి బానిసల్లా పనిచేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ Y.S. రాజశేఖర్‌రెడ్డిని అవమానించిందని కొందరు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. అంతకుముందు కంచిలి నుంచి ప్రజాప్రస్థానం పైలాన్ ఉన్న ప్రాంతం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల...ప్రయాణికులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెరిగిన ధరలతో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో అద్భతమైన అభివృద్ధి జరిగిందని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామంటే చూడటానికి తామంతా సిద్ధమంటూ చురకలు వేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్న టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సవాలును స్వీకరిస్తున్నాన్న షర్మిల మీరు చేసిన అభివృద్ధిని చూడ్డానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. "తేదీ, సమయం మీరు చెప్పినా సరే...మమ్మల్ని చెప్పమన్నా సరే. మేమే కాదు..మీడియా, మేధావులు, ప్రతిపక్షాలు కూడా వస్తాయి. మీరు కట్టిన రాజధాని, పోలవరం, మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడ? మీరు చేసిన అభివృద్ధి చూడాలని ఆంధ్రప్రదేశ్‌లోని వారంతా కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు" అని షర్మిల వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంపురం నుంచి ఇచ్ఛాపురం వరకు ఆర్టీసీ బస్సులో షర్మిల ప్రయాణించారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారి అధికారం ఇవ్వండని అన్న జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఏటా జనవరి ఒకటిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తానని చెప్పి.. నాలుగున్నరేళ్లుగా మోసం చేశారని షర్మిల మండిపడ్డారు. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటున్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు ఇస్తే ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు.. జగన్‌ సార్‌?’ అని సీఎం జగన్‌పై షర్మిల మండిపడ్డారు. ‘జగన్‌రెడ్డి గారూ.. అని అనడం వైసీపీ నేతలకు నచ్చడం లేదని.. అలా అనడం మీకు నచ్చకపోతే.. ఇప్పటి నుంచి జగనన్నగారూ.. అని అనడానికి తనకేం అభ్యంతరం లేదని షర్మిల అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story