AP Results : నాలుగు గంటల్లోనే ఏపీ ఫలితం

AP Results : నాలుగు గంటల్లోనే ఏపీ ఫలితం
X

జూన్ నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఏపీలో ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు ఈసీ అధికారులు. లెక్కింపును విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టామని అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసి, కౌంటింగ్ ప్రక్రియను 4 గంటలలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు.

Tags

Next Story