SHARMILA: నా వాట ఇచ్చి ఎందుకీ బిల్డప్
అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు 82 కోట్లు అప్పు ఇచ్చానని అఫిడవిట్లో చూపించారని... తనకు రావాల్సిన వాటాను అప్పు ఇచ్చినట్లు చూపించడం దారుణమన్నారు. ఆస్తిలో వాటా పొందేందుకు ఆడబిడ్డకూ హక్కు ఉంటుందని.... కొందరు చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారని విమర్శించారు. న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను వంచించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ యాత్ర పర్యటనలో భాగంగా.. కర్నూలులో పర్యటించిన ఆమె..... కర్నూల్ ను స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పి, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు సైతం పూర్తిచేయలేదని మండిపడ్డారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే.. కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవని షర్మిల అన్నారు.
ఐదేళ్లు అధికారమిస్తే.. రాష్ట్రానికి జగన్ చేసిందేంట షర్మిల ప్రశ్నించారు. నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగానే జగన్ చూస్తున్నారని విమర్శించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించేవారికి ఓట్లు వేయొద్దని కోరారు. మరోవైపు వివేకా హత్యలో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేరచరిత్ర గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల సంఘానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదని సునీత ప్రశ్నించారు. Y.S.R జిల్లా వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన సునీత... కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను గెలిపించాలని అభ్యర్థించారు.
? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. ఏదీ ఎక్కడా కనపడదే? ఆర్టీసీ, విద్యుత్‌తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారు. ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికా?.. దేనికి సిద్ధం?’’ అని షర్మిల ప్రశ్నించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com