SHARMILA: దేశం దాటేందుకు అవినాష్‌ సిద్ధం!

SHARMILA: దేశం దాటేందుకు అవినాష్‌ సిద్ధం!
మవుతున్నాడు కడప లోక్ సభ ఎన్నికల్లో అవినాష్‌ ఓటమి ఖాయమన్న షర్మిల... భారతీపై విమర్శలు

కడప లోక్ సభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో వైసీపీ అభ్యర్తి అవినాష్ రెడ్డి ఊరుదాటి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కడప లోక్ సభకు పోటీ చేసే వైసీపీ తప్ప మిగిలిన వాళ్లంతా ప్లేయర్లు కాదంటూ సీఎం జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. వాళ్లే అధికారంలో ఉండాలి వాళ్లే గొడ్డలి పట్టుకుని నరుక్కుంటూ వెళ్లాలనేదే భారతీ వ్యూహమని షర్మిల మండిపడ్డారు. గొడ్డలి తీసుకుని మిగిలిన వాళ్లను నరుక్కుంటూ వెళ్తే తర్వాత సింగిల్ ప్లేయరే ఉంటారని భారతిని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పుడు నేరానికి, న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎటువైపు ఉంటారో...కడప ప్రజలు నిర్ణయించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల రేడియో గిఫ్ట్‌గా పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ ఆయన వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు షర్మిల చెప్పారు.


షర్మిలకు ఎదురుదెబ్బ

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావించరాదని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. బాబాయ్ వివేకా కేసుపై ప్రచారం చేయకూడదని కడప కోర్టు సునీత, షర్మిలను ఆదేశించింది. దాంతో కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్‌ చేయాలని హైకోర్టులో వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఆపై సునీత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కడప కోర్టులోనే తేల్చుకోవాలని వారికి హైకోర్టు సూచించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న కడప కోర్టు.. షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిలకు రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు. జిల్లా లీగల్ సెల్‌కు జరిమానాను కట్టాలని సూచించింది.

Tags

Next Story