AP: నేడే ఏపీ టెట్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. మరోసారి టెట్ నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. నేడు టెట్ జులై-2024 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే డీఎస్సీతోపాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ జూన్ 30న తెలిపారు.
ఇవాళ నోటిఫికేషన్ విడుదల అయితే అభ్యర్థుల ద్వారా రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని సురేష్‌కుమార్ తెలిపారు. ఏపీటెట్ నోటిఫికేషన్, షెడ్యూలు, సిలబస్‌తపాటు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, విధివిధానాలు రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 1,37,903 మంది మాత్రమే అర్హత సాధించారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కొత్తగా 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఇటీవల బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు, గత టెట్‌లో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నిర్ణయం తీసుకోగా దానిపైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆపై ఏపీ కేబినెట్ డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపింది. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ఏపీ మంత్రులు వెల్లడించారు. తెలంగాణ డీఎస్సీ-2024 పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూలు, పరీక్ష విధానం ఇలా తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ-2024 షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది.
Tags
- AP
- TET
- NOTIFICATION
- RELEASING TODAY
- AP CM
- NARA CHANDRABABU
- GIVE PENSIONS
- ANDHRAPRADESH
- MINISTERS
- -AP CABINET
- LIST
- RELEASED
- TDP-BJP-JANASENA
- ALLIANCE
- RELEASE
- MANIFESTO
- TODAY
- JANASENA CHIEF
- PAWAN KALYAN
- FIRE ON
- JAGAN
- MEET CADER
- pawan
- pawankalyan
- JANASENA
- PAC CHAIRMEN
- NARA AP
- HOME MINISTERS
- STRONG
- ORDERS
- TO POLICE
- AP ASSEMBLY
- SESSIONS
- START ON 24TH
- THIS MONTH
- AGRICULTURE MINISTER
- ACCHENAIDU
- SENSATIONAL
- COMMENTS
- GOVT
- DECISION
- TO SUPPLY
- GREENDAL
- CM
- CHANDRABABU
- VISIT
- POLAVARAM
- PROJECT
- NAIDU
- FIRE ON JAGAN
- chandrababu
- cbn
- tdp
- chandrababu naidu
- Chandrababu. family members. Pawan kalyan
- clarity
- 2024 elections
- tv5
- tv5news
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com