AP Speaker : 21నుంచే అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ ఎవరంటే?

ఏపీలో శాసనసభ సమావేశాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఇవి రెండు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుందని సభ వర్గాలు వెల్లడించాయి.తొలి రెండు రోజుల్లో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు సభాపతి ఎన్నిక పూర్తి కానున్నాయి. తొలుత ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించినా... తాజాగా 21నే ప్రారంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పీకర్గా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పేరు దాదాపు ఖరారైనట్లే.
ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించ నున్నారు. డిప్యూటీ స్పీకర్ గా జనసేన తరఫున మండలి బుద్ద ప్రసాద్ లేదా బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ గా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలిస్తున్నారు.
కూటమిలో భాగస్వామ్య పక్షాలకు విప్ పదవులు దక్కనున్నాయని సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువుదీరడతో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు అయిదు సంతకాలు చేశారు.
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. పలువురు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com