Atchannaidu: చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు: అచ్చెన్నాయుడు

X
Atchannaidu: వైసీపీ అసమర్ధ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మూడేళ్ల పాలనలో అధికార పార్టీ నేతల ఆగడాలను చూసి సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని అన్నారు. ఈ సారి ఖచ్చితంగా చంద్రబాబు ఏపీ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన సొంత పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమైందన్నారు. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు.. ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేదని వారే స్వయంగా చెబుతున్నారని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
