AP : పవన్ ను వీడిన నమ్మిన బంటు.. జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై

ఎన్నికల టైంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేశ్ (Pothina Mahesh) తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. విజయవాడ వెస్ట్ నుండి జనసేన తరుపున పోటీ చేయాలనీ ఎప్పటి నుండి భావిస్తూ వస్తున్న పోతిన మహేష్ కు జనసేన టికెట్ దక్కలేదు.
పొత్తులో భాగంగా ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తోంది. పదేళ్లుగా జనసేన తో నడుస్తూ…పవన్ కల్యాణే మా ప్రాణం అని..చెప్పుకుంటూ, పార్టీ కోసం కష్టపడుతూ వచ్చాననీ.. చివరకు పవన్ కళ్యాణ్ చేసింది జీరో అని మహేశ్ అంటున్నారు. జగన్ ను ఓడించేందుకు బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వరకు ఓకే కానీ కనీసం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన కీలక నేతలకు కూడా టికెట్ ఇప్పించలేకపోయారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
పోతిన మహేశ్.. మొదటి నుండి విజయవాడ వెస్ట్ సీటు ఆశించారు. బీజేపీ నుంచి సుజనా చౌదరి బరిలో దిగడంతో.. పవన్ కూడా సైలెంట్ అయిపోయారు. మహేష్ చేసేది లేక పార్టీకి గుడ్ బై చెబుతూ లేఖ రాశారు. పవన్ బుజ్జగింపులు పనిచేస్తాయా అన్నది వేచిచూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com