AP : ఏపీలో బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలివే..!

AP : ఏపీలో బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలివే..!

టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తు నంబర్లు కన్ ఫామ్ అయ్యాయి. పొత్తులో భాగంగా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇవాళ రాత్రికి గానీ.. రేపటికి కానీ పక్కా వివరాలు బయటకొస్తాయని తెలుస్తోంది. ఈ లోపు పార్టీలు విడుదల చేస్తున్న లీకులు.. ఆసక్తికరంగా మారాయి.

కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశంలో సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రానుంది. ఆ తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన – బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపైనా స్పష్టత వచ్చే చాన్సుంది.

బీజేపీకి పోటీ చేసే ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ కింది సెగ్మెంట్ల నుంచి ఎంపిక చేయనున్నారు.

పాడేరు

విశాఖ నార్త్

పి. గన్నవరం

కాకినాడ అర్బన్

ఉంగుటూరు

కదిరి

మదనపల్లె

కాళహస్తి

కైకలూరు

పైన 9 స్థానాల నుంచి ఆరింటిని బీజేపీ ఎంపిక చేసుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story