CASE: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు

పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనతో సహా రాచమల్లు బావమరిది బంగారు మునిరెడ్డిపై ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిన్న ప్రొద్దుటూరు పోలీసులు ట్రబుల్ మాంగర్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్త నవీన్‌కుమార్‌రెడ్డిని.. పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిపించారు. నవీన్ కోసం ఎమ్మెల్యే రాచమల్లు, మునిరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ అనుచరుడినే..... స్టేషన్‌కు పిలిపిస్తారా అని సీఐ శ్రీకాంత్‌ను బెదిరించారు. కౌన్సిలింగ్ జరుగుతుండగా...... నవీన్‌ను స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్నCIఫిర్యాదుతో ఎమ్మెల్యే, ఆయన బావమరిదిపై కేసులు నమోదు చేశారు.
సిట్ దర్యాప్తు ముమ్మరం
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై.... ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తులో వేగం పెంచింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను S.V.U క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో సిట్ బృందం పరిశీలించింది. సిట్ సభ్యులు.. డీఎస్పీ మనోహరాచారి... S.V.U క్యాంపస్ పోలీస్ స్టేషన్ S.I, C.Iలను విచారించారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పులివర్తి నానిపై..... హత్యకు యత్నించిన మహిళా విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం..చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లిలో విచారణ చేపట్టారు. కూచివారిపాలెంలో దాడులపై గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు అందజేయాలని కోరారు. తర్వాత.... రామిరెడ్డిపల్లె సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్ మెన్ ఈశ్వర్‌ను విచారించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నివేదికను అందజేస్తామని సిట్ సభ్యులు D.S.P మనోహరాచారి తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలుస్తామని, ప్రతి F.I.Rనూ పరిశీలిస్తానని చెప్పారు.
ఎన్నికలు ఆ తర్వాత జరిగిన హింసపై నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్ల సమయంలోని వీడియోలను పరిశీలించారు. సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు వచ్చినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com