AP: ఏపీలో ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. పార్టీ వేరు ప్రభుత్వం వేరని, పార్టీ నీడ ప్రభుత్వంపై పడకూడదన్నారు. కానీ ఏపీలో రెండింటికి మధ్య గీత చెరిగిపోయిందని రమేశ్ కుమార్ ఆరోపించారు. విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో..ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్ధాం.. అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నిమ్మగడ్డ రమేష్ , CFD సభ్యుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి., విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల రవిశంకర్ ఓటర్లకు అవగాహన కల్పించారు. ఏపీలో ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు అంతులేదన్న నిమ్మగడ్డ... ఎన్నికల అక్రమాలకు ప్రయోగశాలగా మారిందని విమర్శించారు. ప్రజస్వామ్య విలువలను పరిరక్షించుకునే లక్ష్యంతోహైకోర్టును ఆశ్రయించనున్నామని రమేశ్ కుమార్ వెల్లడించారు.
మరోవైపు... ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయంటూ.. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో.......... వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం...... సీఎంకు తెలుసా అని ప్రశ్నించారు. గుంటూరులో కలుషిత జలంతో డయేరియా కేసులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక మంది ఆస్పత్రిపాలవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుందంటే..... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని దుయ్యబట్టారు.గుంటూరులో డయేరియాతో నలుగురు, కలరాబారినపడి.. ముగ్గురు చనిపోయారని వాపోయారు. సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ సీఎంకు ప్రజల ప్రాణాలపై లేకపోవడం..... బాధాకరమన్నారు. వెంటనే ప్రజలకు సురక్షిత నీరు అందించడం సహా........ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com