AP : చంద్రబాబు, బాలకృష్ణ ఆస్తులు ఎంతంటే?

AP : చంద్రబాబు, బాలకృష్ణ  ఆస్తులు ఎంతంటే?

టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆమె తమ ఆస్తులను ప్రకటించారు. ఇద్దరికీ కలిపి రూ.931 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇది 2019 ఎన్నికల నాటి ఆస్తులతో పోలిస్తే 39 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. రూ.3 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక నిన్న హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు అని, కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు రూ.58.63 కోట్లు అని తెలిపారు. తనకు రూ.9.9కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.

కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువత భవిష్యత్తును నాశనం చేశారని ఫైరయ్యారు. తాము పోలీసు ఉద్యోగాలు ఇస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20వేలు అందజేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాయదుర్గం సభలో చంద్రబాబు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story