AP : ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: చంద్రబాబు

AP : ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: చంద్రబాబు
X

ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతీ ఒక్కరిలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ వాళ్లు కుట్రలు పన్నుతూ వచ్చారని, అయితే.. ప్రజాస్వామ్యస్ఫూర్తితో వారి కుట్రలను టీడీపీ శ్రేణులు భగ్నం చేశాయని అన్నారు. వైసీపీ హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని, తాము దీటుగా ఎదుర్కోవడంతో వారి ఆటలు సాగలేదని బాబు అన్నారు.

ఓటింగ్‌లో ప్రభుత్వ సానుకూలత కనిపించిందన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. ‘సజ్జలా.. మీ వైసీపీ దుకాణం బంద్ అయింది. ప్రజల్ని ఇంకా నమ్మించాలని చూడొద్దు. ఈ పిచ్చి మాటలు మానేయండి. చిత్తూరు, అన్నమయ్య, కడప, పల్నాడు జిల్లాల్లో మీ పార్టీ అరాచకాల గురించి కూడా చెప్పాల్సింది కదా? సిగ్గు లేకుండా ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రెండు నెలలుగా ఎన్నికల పోరు హోరెత్తింది. వైసీపీ- కూటమి(TDP,BJP,JSP) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. కొందరు ఓటర్లను ప్రలోభపెట్టారు. చివరికి ఇవాళ అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 22 రోజుల తర్వాత.. అంటే జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే అప్పటివరకు ఆగాల్సిందే. అప్పటివరకు అభ్యర్థులు, వారి అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగనుంది.

Tags

Next Story