డీజీపీ ఓ మోనార్క్‌లా ప్రవర్తించడం దారుణం : చంద్రబాబు

డీజీపీ ఓ మోనార్క్‌లా ప్రవర్తించడం దారుణం : చంద్రబాబు
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఉన్మాది పరిపాలనను మరపించేలా ఏపీలో పాలన ఉందంటూ చంద్రబాబు మండిపడ్డారు. కళా వెంకట్రావు ఏం తప్పు చేశారని ప్రశ్నించారంటూ నిలదీశారు. మరి ఎంపీ విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతిచ్చారో చెప్పాలని డీజీపీని నిలదీశారు. కళా వెంకట్రావు అరెస్ట్‌ పై డీజీపీ కచ్చితంగా సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఏపీలో ఉంది ఇండియన్ పినల్ కోడా లేక జగన్ పినల్ కోడా అని ప్రశ్నించారు.

40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నది మీ దగ్గర తన్నులు తినడానికా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, హోమ్ మంత్రి, డీజీపీ ఒక మతం వాళ్ళు ఉంటే ఇలానే ఉంటుందన్నారు. డీజీపీ ఓ మోనార్క్‌లా ప్రవర్తించడం దారుణమన్నారు చంద్రబాబు.

హిందూ దేవుళ్లపై దాడులు చేసినట్టు ఒప్పుకున్న పాస్టర్‌ ప్రవీణ్‌ను ఎందుకు రహస్యంగా విచారిస్తున్నారని ప్రశ్నించారు. నెల్లూరులో వైసీపీ నేత ప్రసన్నకుమార్‌ పోలీసులను తిడితే డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం క్రిష్టియన్‌ మతానికి చెందిన వారైతే దేవాలయాలను కాపాడే బాధ్యత లేదా అని నిలదీశారు.

న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం అనవసరం అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని.. రానున్న రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ కూడా వద్దని సీఎం జగన్‌ అంటారోమో అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story