Chandrababu fires on YCP: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది: చంద్రబాబు

Chandrababu (tv5news.in)
Chandrababu fire on YCP: ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు. సీఎం జగన్, డీజీపీకి తెలిసే ఈ దాడులు జరిగాయన్నారు. 40 ఏళ్ల రాజకీయజీవితంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటూ ఫైర్ అయ్యారు.
ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారన్నారు. వంద మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారన్నారు. డీజీపీకి.. సీఎంకు తెలిసే టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిందన్నారు చంద్రబాబు. డ్రగ్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు.
ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే ప్రశ్నించకూడదా..?. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా..?. పులివెందుల రాజకీయాలు చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు. స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తున్నామన్నారు.రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందన్నారు చంద్రబాబు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కయిపోయారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడికి అభివర్ణించారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదు
చంద్రబాబు కామెంట్స్:
కాపాడగలిగితే డీజీపీగా ఉండండి లేదా వదిలేసి వెళ్లండి..
మమ్ముల్ని మేము కాపాడుకోగలం.. మాకు భద్రత అక్కర్లేదు
డీజీపీ ఆఫీసు మీద ఇలాంటి దాడి జరిగితే ఊరుకుంటారా.
ఎంత మందిని చంపుతారు.. ఎంత మందిని హింసిస్తారు.
కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది
అలా ఎవరూ భయపడరు... మీపై తిరగబడతారు..
మీ ఇష్ట ప్రకారం దాడులు చేస్తే భయపడతారని అనుకుంటున్నారు.
రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
గవర్నర్, కేంద్ర హోంమంత్రి స్పందించగా లేనిది డీజీపీ స్పందించరా..?
నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తరా.. ?
ముఖ్యమంత్రి, డీజీపీ కుమ్ముక్కై ఈ దాడి చేశారు.
బంద్‌కు సహకరించాలని ప్రజలందరినీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా
ిఇలాంటి వాటిపై స్పందించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..?
ఇలాంటి తప్పుడు పనులు చేస్తే చివరికి నాశనమయ్యేది మీరే..
ఇలాంటి రౌడీలను చాలా మందిని చూశాను.. ప్రాణాలు పోయినా భయపడను..
ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి
అయినా దాడి జరిగిందంటే వారిద్దరూ కుమ్ముక్కయ్యారనడానికి..
ఈ పక్కనే సీఎం నివాసం, డీజీపీ ఆఫీసులున్నాయి
మనం రాజ్య ప్రాయోజిత హింసపై పోరాడాల్సిన అవసరం ఉంది
ఇలాంటి పోరాటాలు తెలుగుదేశం పార్టీ నిరంతరం చేస్తూనే ఉంది
మనల్ని మనం కాపాడుకుంటూనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం..
లేదంటే రాష్ట్రంలో ఎవరూ మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను, నాయకులను ఉండనివ్వరా..?
ఇప్పుడు రాష్ట్రంలో ఆర్టికల్ 356 పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయవద్దు.. ?
ఆర్టికల్ 356 పెట్టాలని డిమాండ్ చేస్తారు
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే...
ప్రశ్నించిన వారందరినీ అణచివేసే పరిస్థితి ఉంది...
పార్టీల ఆఫీసులపైనే దాడులు జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి..?
ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశం
ఇది తెలుగుదేశం ఒక్క పార్టీకే సంబంధించిన విషయం కాదు
గతంలో ఎప్పుడూ ఇలాంటి దాష్టీకాన్ని చూడలేదు
రేపు టీడీపీ నిర్వహించే రాష్ట్ర బంద్‌కు అందరూ సహకరించాలి
గంజాయి సాగు గురించి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు జవాబు చెప్పాలి
ఇదంతా ఏపీ నుంచే వస్తోందని అక్కడి పోలీసులు చెప్పారు
తెలంగాణలో గంజాయి సాగు ఎక్కడా లేదని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు
రాష్ట్రం డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది
మీరు లాలూచీ పడి టీడీపీ ఆఫీసుపై దాడి జరుగుతున్నా చూస్తూ ఉన్నారు
అలాంటి పోలీసులు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నిస్తున్నా
డీజీపీ ఆఫీసు పక్కనే దాడి జరిగితే కాపాడలేకపోయారు..
ఏ చిన్న పార్టీ కార్యాలయంపై కూడా ఇప్పటివరకు దాడి జరగలేదు
రాజకీయ పార్టీల ఆఫీసులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువుటద్దాలు
ఇలాంటి దాడి జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే కార్యాలయం ఇది
పట్టాభి ఇంటితో పాటు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు
ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కయిపోయారు
రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది
ఇంత దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదు
40 ఏళ్లుగా నేను రాజకీయాలు చూస్తున్నాను
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com