AP : కుప్పంలో చంద్రబాబు.. నేటినుంచి రెండురోజులు ప్రజాగళం
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) తన సొంత జిల్లా చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇవాళ, రేపు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పంలో 25, 26 తేదీల్లో కుప్పంలోనూ, 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి సభల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.
31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. 1989 నుంచి కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు చంద్రబాబు. ఏడు సార్లు పోటీ చేసిన ఆయన… విజయం సాధిస్తూ వచ్చారు. 1994 నుంచి 2014 వరకూ చంద్రబాబు మెజార్టీ 45 వేలకు తగ్గలేదు.
గత ఎన్నికల్లో మెజార్టీ 30 వేలకు పడిపోవడంతో.. ఈ సారి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సారి లక్ష ఓట్లు మెజార్టీ సాధించాలని పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు. దీనికి అనుగుణంగా నేతలు, కార్యకర్తల్ని సమాయత్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. మరోవైపు.. వైనాట్ కుప్పం అంటూ సీఎం వైఎస్ జగన్.. కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా తిప్పికొట్టే వ్యూహంలో టీడీపీ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com