Chandrababu: రైతులు ఉరేసుకోవడం కాదు.. ఈ ప్రభుత్వాన్ని ఉరి తీయాలి- చంద్రబాబు

X
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌నిర్మాణం చేయాలన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. రాష్ట్ర పునర్‌నిర్మాణం కోరుకునే ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకోకుండా తటస్థులుగా ఉండే వారు సభ్యత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తటస్థులు.. మేధావులు కూడా టీడీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా చేశారన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయి రైతులు ఉరేసుకోవడం కాదు.. ఈ ప్రభుత్వాన్ని ఉరి తీయాలన్నారు చంద్రబాబు. తానొక్కడినో.. ఒక్క టీడీపీనో ప్రభుత్వంపై పోరాటం చేస్తే సరిపోదని.. ప్రజల్లోనూ అవగాహన రావాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
