SVSN వర్మకు చంద్రబాబు ఫోన్
Pithapuram : పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకు చంద్రబాబు ఫోన్ చేశారు. ఇవాళ విజయవాడ రావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే తాను శనివారం కలుస్తానని వర్మ బదులిచ్చినట్లు సమాచారం. కాగా, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు, వర్మ వర్గీయులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వర్మ ట్వీట్ చేశారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మకే సీటు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు. 2014లో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా 47వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. వర్మకు 97,511 ఓట్లు రాగా, వైసీపీకి 50,431, టీడీపీకి 15,187 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత టీడీపీలో చేరిన వర్మ 2019లో వైసీపీ చేతిలో ఓడిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com