AP : కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నా : చంద్రబాబు

కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని మండిపడ్డారు. ‘అర్చకుడంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తాం. వారి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. వైసీపీ నేతల మదానికి ఇది నిదర్శనం’ అని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి హద్దు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ లో విమర్శించారు. పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలోని ఓ గుడిలో పూజారులపై వైసీపీ నేత దాడి చేశారని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.
అర్చకులపై దాడిని కాకినాడ అర్చకుల సంఘం ఖండించింది. కాకినాడ శివాలయంలో పూజ సరిగా చేయలేదని గర్భగుడిలో ఇద్దరు అర్చకులపై వైసీపీ నాయకుడు చంద్రరావు దాడికి దిగారు. అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్‌కుమార్‌పై దాడి చేశారు. చంద్రరావు దాడిని అర్చకుల సంఘం తీవ్రంగా ఖండించింది. చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com