AP : మోదీ నామినేషన్‌కు చంద్రబాబు

ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధాని ఆహ్వానించారు. ఏపీలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి కూడా ఆహ్వానం అందింది. ఈక్రమంలో ఎల్లుండి ప్రత్యేక విమానంలో ఆయన వారణాసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎన్డీయే మిత్రపక్షాల సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
చంద్రబాబు మంగళవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమ అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు మాట్లాడతారు. అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు.
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, నడ్డా చెబుతున్నారు. అందుకే టీడీపీకి ప్రయారిటీ పెరుగుతోందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీగా టీడీపీ నిలిచే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com