AP : ఈ సాయంత్రం చంద్రబాబు తొలి సంతకం వీటిపైనే!
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) నేడు గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, మూడో సంతకం వృద్ధాప్య పింఛన్లు రూ.4 వేలకు పెంపు, 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ పై చేయనున్నారని సమాచారం.
ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రమాణ స్వీకారం వేదికపైనే ఆయన తొలి సంతకం చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఆయన నిన్న బుధవారం రాత్రికి తిరుమలకు వెళ్లారు. ఇవాళ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి తిరిగివచ్చి బాధ్యతలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టే చాన్సుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com