ఇది ఆరంభం మాత్రమే.. మీ బాబాయిని ఎవరు చంపారో చెప్పాలి : చంద్రబాబు

ఇది ఆరంభం మాత్రమే.. మీ బాబాయిని ఎవరు చంపారో చెప్పాలి : చంద్రబాబు
ఫేక్‌ ముఖ్యమంత్రి.. ఫేక్‌ వార్తలే చెబుతుంటారని జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది ఆరంభం మాత్రమేనన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వీరోచితంగా పోరాడారన్నారు. ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వం కొనసాగడానికి వీలు లేదన్నారు చంద్రబాబు.

ALSO READ : గుట్టల్లో దెయ్యం.. భయపడి చస్తున్న జనం!

ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే మరో 10 శాతం సీట్లు వచ్చేవన్నారు చంద్రబాబు. అధికార పక్షం డబ్బు, అధికార దుర్వినియోగంపై ఆధారపడిందని ఆరోపించారు. భయపెట్టి ఓట్లు వేయించుకుంటే అది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయా అని ఎస్‌ఈసీని అడుగుతున్నామన్నారు చంద్రబాబు.

ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్ని ఇష్టానుసారం బెదిరించారన్నారు చంద్రబాబు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆలూరులో జయరాం ఏమయ్యారని ప్రశ్నించారు. కుప్పంలో టీడీపీ లేకుండా చేస్తానని ఓ పోలీసు అధికారి అంటున్నారని..టీడీపీని లేకుండా చేయడం నిన్ను పుట్టించినవారి తరం కూడా కాదన్నారు చంద్రబాబు.

ఫేక్‌ ముఖ్యమంత్రి.. ఫేక్‌ వార్తలే చెబుతుంటారని జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. మీ బాబాయిని ఎవరు చంపారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ కావాలన్నారని.. అధికారంలోకి వచ్చాక సీబీఐ వద్దంటున్నారని విమర్శించారు.

తప్పు చేసిన అధికారులు ఎక్కడున్నా వెంటాడుతామని హెచ్చరించారు చంద్రబాబు. ఊడిగం చేసేందుకు దొంగ స్వామిని అడ్డం పెట్టుకుంటారా? అని నిప్పులు చెరిగారు. భోగాలు అనుభవించేవారు స్వాములు కారని.. రామతీర్థంలో రాముడి తల తీసేస్తే ఈ స్వామి మాట్లాడరని అన్నారు చంద్రబాబు. సీఎంకు సిగ్గుందా అని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story